నిజామాబాద్ నగర శివారులోని రోటరీ నగర్లో ఇంటి బయట పార్క్ చేసిన ద్విచక్రవాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ప్రాంతంలో తరచుగా ద్విచక్ర వాహనాలు పోతుండడం వల్ల కాలనీ వాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి బైక్ ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఐదో పట్టణ పోలీస్ స్టేషన్లో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచి దొంగలను పట్టుకోవాలని రోటరీ నగర్ వాసులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: రూ.2 లక్షల 57 వేల విలువైన గుట్కాను పట్టుకున్న పోలీసులు