నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం సుమారు రెండు గంటల పాటు కురిసిన కుండపోత వర్షంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్‌కు ఆటంకం ఏర్పడింది. రోడ్లపై మోకళ్ల లోతులో వాననీరు ఉండడం వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వరదనీటి కారణంగా రోడ్లు జలమయమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చూడండి: అకాల వర్షం... అన్నదాతల దైన్యం