ఎస్సారెస్పీ 22 గేట్లు ఎత్తిన అధికారులు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలసవ్వడులు
SRSP Water Levels: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 22గేట్లు ఎత్తి 99,940 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,10,690 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 1087.6 అడుగుల నీటిమట్టం ఉండగా .. 75.145 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 2500క్యూసెక్కులు.. కాకతీయకాలువ ద్వారా 3500 క్యూసెక్కులు.. వరద కాలవ ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు