లాక్‌డౌన్ నేపథ్యంలో బతుకుదెరువుకు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. రహదారుల సమీపంలో దాతలు అందజేస్తున్న భోజనం తిని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. చీకటి పడగానే చెట్ల కింద సేదదీరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్తున్నారిలా..
ఉపాధి కరువై... బతకు భారమై - ఉపాధి కరువై... బతకు భారమై
రాష్ట్రంలో వలస కూలీలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పొట్టచేత పట్టుకుని వచ్చిన ఊర్లో పనిలేక, సొంత ఊరికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా వారు మాత్రం స్వగ్రామాలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.
ఉపాధి కరువై... బతకు భారమై