ETV Bharat / state

సీతారాంనగర్​ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ - మేయర్​ నీతూ కిరణ్​ తాజా వార్తలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 8వ డివిజన్ సీతారాంనగర్ కాలనీలో పట్టణ ప్రగతి నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్​ విక్రమ్​గౌడ్​తో కలిసి మేయర్ నీతూ కిరణ్​ ప్రారంభించారు.

The mayor  started the road construction work in Sitaramnagar colony
సీతారాంనగర్​ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్
author img

By

Published : Aug 27, 2020, 2:36 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణాలు, పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని నిజామాబాద్​ నగర మేయర్​ నీతూ కిరణ్​ పేర్కొన్నారు. పట్టణంలోని సీతారాంనగర్​ కాలనీలో రూ.10 లక్షలతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్​తో కలిసి ప్రారంభించారు.

గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీవాసుల సమస్య నేటితో తీరిపోతుందని మేయర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పట్టణాలు, పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా సహాయ సహకారంతో నగరంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీర్ ఇనాయత్ కరీం, శ్రీకాంత్, ఇతర సిబ్బంది, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.