కొవిడ్‌తో మృతి చెందిన కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మోర్తాడ్‌కు చెందిన మస్తా బాబన్న(60) వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. అతని రెండో కుమారుడు ప్రాంతీశ్(30)కు కరోనా సోకడంతో.. జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో ప్రాంతీశ్ ఇవాళ కన్నుముశారు.
కుమారుడి మృతదేహాన్ని తీసుకుని బాబన్న.. తమ స్వగ్రామమైన మొలతాడుకు బయలుదేరారు. జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ వద్ద 44వ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వస్తోన్న ఓ టిప్పర్.. వీరు ప్రయాణిస్తోన్న అంబులెన్స్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. బాబన్న అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కుటుంబంలో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: కరోనా కష్టాలు: మాటలే.. చేతలేవి!