తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం: కవిత తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం.. దేశవ్యాప్తంగా అమలవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కవిత పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. ముందుగా నగరంలో మత్స్యకారులకు వాహనాలు, సామాగ్రి, రివాల్వింగ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. త్వరలో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా చేపల మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కలెక్టరేట్లో టెలికాం సలహా మండలి సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 4జీ సేవలు, కందకుర్తిలో బీఎస్ఎన్ఎల్ టవర్ ప్రారంభించారు.
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని .. దీనివల్ల దేశం మొత్తానికి మేలు జరుగుతోందని ఎంపీ ఆనందం వ్యక్తం చేశారు.