నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో 2019 -2020 విద్య సంవత్సరానికి పీజీ సీట్లు మిగిలిపోయాయి. వాటిని భర్తీ చేయడానికి వీసీ అనుమతినివ్వాలని గత 20 రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరంకాకుండా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించి అవకాశం కల్పించాలని కోరుతూ విద్యార్థులు ర్యాలిగా వచ్చి వీసీ ఛాంబర్లో బైఠాయించారు. ఉపకులపతి అనిల్ కుమార్కు వినతి పత్రం అందించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ అరెస్ట్