శంషాబాద్ పరిధిలో జరిగిన వరుస హత్యలను నిరసిస్తూ ఖమ్మంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పాడి నిరసన వ్యక్తం చేశారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థినిలు జిల్లా గ్రంథాలయ వద్ద రోడ్డుపై మానవహారంగా ఏర్పడి.. ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పశువైద్యురాలిపై హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ధర్నా చౌక్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: 'మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఉన్నా... లేనట్టే'