నారాయణ స్కూల్ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిజామాబాద్‌లోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాయి. అనుమతి లేకుండా జిల్లా కేంద్రంలో స్థానిక సెయింట్ తెరెసా హై స్కూల్ నిర్వాహకులు నారాయణ స్కూల్ పేరుతో అడ్మిషన్లు ప్రారంభించారని మండిపడ్డారు.
ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఇదంతా చూస్తూ కూడా విద్యాశాఖధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'