నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం తొర్లికొండలో హాస్టల్ భవనంపై నుంచి ఓ విద్యార్థి కిందపడ్డాడు. తొర్లికొండ ఎస్సీ బాలుర వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న.. ఇందళ్వాయి గ్రామానికి చెందిన జీవన్.. మంగళవారం సాయంత్రం భోజనం తర్వాత భవనంపైకి ఎక్కి.. అకస్మాత్తుగా అక్కడి నుంచి పడిపోయాడు.
దీనితో అతని తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండిః వరుస రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యమే కారణమా?