ఎగువనున్న గైక్వాడ్ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రోజుకి 10 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నీటిపారుదల శాఖ అధికారులు 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు దిగువ భాగంలోని మిడ్ మానేరులోకి 8 టీఎంసీల నీటిని పంపించనున్నారు.
ప్రస్తుతం 2వేల క్యూసెక్కుల నీటిని 5 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ నీటిని 6 వేల క్యూసెక్కులకు పెంచనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090 అడుగల మేర 86 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గైక్వాడ్ ప్రాజెక్టు ద్వారా వస్తున్న ఇన్‌ఫ్లోకు అనుగుణంగా ప్రాజెక్టులో 86 టీఎంసీల నీరు తక్కువ కాకుండా నిల్వ చేయనున్నారు.