Khilla Ramalayam in Nizamabad : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఖిల్లా రామాలయం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఎత్తైన ప్రదేశంలో ఆలయం ఉండటం, చుట్టూ పరిసరాలు, వాతావరణం అందంగా ఉండటంతో నిత్యం భక్తులు ఆలయానికి వస్తూనే ఉంటారు. అలాగే షార్ట్ ఫిల్మ్స్, ఫొటో షూట్ల కోసం కూడా ఎంతోమంది ఈ ప్రదేశానికి వస్తుంటారు. దీంతో ఆలయంలో విద్యుత్ వాడకం అధికంగానే ఉండేది. ప్రతి నెలా ఆలయ కమిటీకి విద్యుత్ బిల్లుల భారం ఎక్కువయ్యేది. ఆలయానికి వచ్చే ఆదాయం కంటే.. విద్యుత్ బిల్లు చెల్లించడమే కష్టంగా మారేది. కానీ ఇప్పుడు విద్యుత్ బిల్లు అనే మాట అక్కడ వినిపించడం లేదు. సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవడంతో భారం తప్పిందని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు.
Khilla Ramalayam Temple in Nizamabad గతంలో నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన యోగితా రాణా ఐదేళ్ల కిందట ఒకరోజు రామాలయ సందర్శన కోసం వచ్చారు. అప్పట్లో విద్యుత్ బిల్లును తట్టుకునేందుకు కొన్ని లైట్లను మాత్రమే ఆలయంలో వినియోగించేవారు. ఆమె సందర్శన సమయంలోనే కరెంట్ సైతం పోయింది. ఆలయ సమస్యలు అర్థం చేసుకున్న ఆమె.. వెంటనే సోలార్ సౌకర్యం కోసం సుమారు రూ.6 లక్షల ప్రత్యేక నిధులు కేటాయించారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు 5 కేవీ సామర్థ్యంతో సుమారు 20 వరకు సోలార్ పలకలను ఆలయంలోని కల్యాణమండం పైభాగంలో ఏర్పాటు చేశారు.
dichpally ramalayam temple : అప్పటి నుంచి ఆలయంలో విద్యుత్ భారం పూర్తిగా పోయింది. సోలార్ విద్యుత్ ఉపయోగించి ఆలయం చుట్టూ దీపాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. సోలార్ వెలుగులు గుడి చుట్టూ కనిపిస్తాయి. కల్యాణ మండపానికి సైతం సోలార్ కరెంట్‌నే వాడుతున్నారు. అప్పట్లో కలెక్టర్ యోగితారాణా చేసిన ఉపకారం.. డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో నేటికీ సౌర వెలుగుల రూపంలో గుర్తు చేస్తూనే ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి..
ఇవాళ హైకోర్టు ముందుకు 'ఎమ్మెల్యేలకు ఎర' కేసు
మేక రూపురేఖలతో పుట్టిన కుక్కపిల్ల.. చూసేందుకు తరలివస్తున్న జనం