ETV Bharat / state

గోదావరి తీరాన ఏరువాక పౌర్ణమి... పుణ్యస్నానాల సందడి - special bath in godhawari occasion of eruvaka sandhadi

నిజామాబాద్​ జిల్లాలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

special bath in godhawari occasion of eruvaka sandhadi
గోదావరి తీరాన ఏరువాక పౌర్ణమి... పుణ్యస్నానాల సందడి
author img

By

Published : Jun 5, 2020, 3:44 PM IST

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది భక్తులతో సందడిగా మారింది. జిల్లాలోని కందకుర్తి, ఉమ్మేడ, పోచంపాడ్ వద్ద భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి ఒడ్డున ఉన్న శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతులు తమ పనులకు శ్రీకారం చుడితే మంచి జరుగుతుందని నమ్మకం. గోదావరిలో స్నానం చేసి వ్యవసాయ పనిముట్లు, పుడమితల్లి, పశువులను పూజిస్తారు. ఇలా చేస్తే పాడి పంటలు బాగుంటాయని ప్రతీతి.

ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.