ETV Bharat / state

తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆరుగురు - అసెంబ్లీకి నిజామాబాద్​ నుంచి కొత్త ముఖాలు - నిజామాబాద్​ రూరల్​ నుంచి భూపతిరెడ్డి

Six People Won MLAs For The First Time in Nizamabad : ఎమ్మెల్యేగా ఎదగాలని కొందరు, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి అనూహ్య విజయం సాధించిన వారు మరికొందరు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన వారే అధికం. ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు తొలిసారిగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. కామారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు. నిజామాబాద్ నుంచి ముగ్గురు అసెంబ్లీలో కాలు పెట్టనున్నారు.

MLAs elected for the first time in Nizamabad
Six People Won MLAs For The First Time in Nizamabad
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 11:25 AM IST

తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆరుగురు - అసెంబ్లీకి కొత్త ముఖాలు

Six People Won MLAs For The First Time in Nizamabad : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 6 నియోజకవర్గాల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఆరుగురు విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్‌లో వ్యాపారవేత్త ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా(Surya Narayana Gupta) ఎమ్మెల్యేగా గెలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తన సామాజిక వర్గానికే చెందిన గణేష్‌గుప్తాపై విజయం సాధించారు. నిజామాబాద్​కు చెందిన ధన్‌పాల్ సూర్యనారాయణ విశ్వ హిందూ పరిషత్​లో సభ్యుడిగా చేరి అధ్యక్షుడిగా ఎదిగారు. వ్యాపారవేత్తగా ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితులు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీజేపీలో చేరి 2014లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో అవకాశం రాలేదు. 2023లో మళ్లీ బీజేపీ నుంచే పోటీ చేసి గెలుపొంది తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్నారు.

తెలంగాణలో కొత్త సర్కార్​ - ప్రభుత్వ అధికారుల పోస్టింగులపై చర్చ - డీజీపీ నుంచి సీఐ వరకు బదిలీలు!

Bhupathi Reddy Wins Nizamabad Rural Constituency : నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం(Nizamabad Rural Constituency) నుంచి రేకులపల్లి భూపతిరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిజామాబాద్‌ గ్రామీణ మండలం జలాల్‌పూర్‌కు చెందిన వైద్యుడు భూపతిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, అప్పటి తెరాస(బీఆర్​ఎస్​) నుంచి భూపతిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. పలు కారణాలతో భూపతిరెడ్డి టీఆర్​ఎస్​(బీఆర్​ఎస్​)కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్​లో చేరారు. 2018 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్​పై విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్మూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ అనుభవం లేకుండానే, పోటీ చేసిన మొదటి సారే నేరుగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పైడి రాకేష్‌రెడ్డి స్వగ్రామం ఆర్మూర్‌ మండలం అంకాపూర్. వ్యాపారవేత్త అయిన రాకేష్‌రెడ్డికి బీజేపీ టికెట్ కేటాయించింది. ఎన్నికలకు 3 నెలల ముందు నియోజకవర్గానికి వచ్చిన రాకేష్‌రెడ్డి, ఎలాంటి అంచనాలు లేకుండానే పోటీకి దిగి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అనూహ్య విజయం సాధించారు.

Katipally Venkata Ramana Reddy Wins Kamareddy : కామారెడ్డి నుంచి సంచలన విజయం నమోదు చేశారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. సీఎం, కాబోయే సీఎంలను కలిపి ఓడించి చరిత్ర సృష్టించారు. తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిది రాజకీయ కుటుంబం. రమణారెడ్డి తండ్రి రాజారెడ్డి సమితి అధ్యక్షుడిగా పని చేశారు. తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పని చేశారు.

తాడ్వాయి మండల జడ్పీటీసీగా ఎన్నికై, ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్​గా పని చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో కొన్నాళ్లు పని చేశారు. అనంతరం కొన్నిరోజుల పాటు తటస్థంగా ఉంటూ వచ్చారు. ఆరేళ్ల కిందట బీజేపీలో చేరి 2018లో కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి కాటిపల్లి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలపై వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు.

తెలంగాణ కొత్త సీఎం అనుముల రేవంత్‌ రెడ్డి - జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం సాగిందిలా

Madanmohan Rao Wins Yellareddy Constituency : ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్‌మోహన్‌రావు తొలిసారి విజయం సాధించారు. మదన్మోహన్‌ స్వస్థలం కామారెడ్డి కాగా ఐటీ కంపెనీలను నిర్వహిస్తుంటారు. 2009లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్​లో చేరి 2014, 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టికెట్‌ విషయంలో తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నా, చివరకు అక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. జుక్కల్ నియోజకవర్గం నుంచి ఎన్నారై తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ నుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తోట స్వస్థలం సంగారెడ్డి జిల్లా సిర్గపూర్ మండలం కాగా, ఎన్నారైగా ఉండి మొదటి సారి పోటీ చేసినా లక్ష్మీకాంతరావు స్థానికంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేపై విజయం సాధించారు.

రేవంత్​ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు - ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా కసరత్తు

మిగ్​జాం ఎంత పనిచేసింది - కోతకొచ్చిన పంటను నేలరాల్చింది - ధాన్యం కుప్పలను నీట ముంచింది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.