ETV Bharat / state

Orphan baby: అమ్మా నేను భారమా.. ఎందుకీ దూరం..?

author img

By

Published : Dec 11, 2021, 5:24 AM IST

Orphan boy: ఆరు నెలల వయసులోనే కన్నవారి ప్రేమకి దూరమయ్యాడు ఆ చిన్నారి. హైదరాబాద్‌లో అనుమానస్పద స్థితిలో పోలీసులకు చిక్కిన వ్యక్తిని ప్రశ్నిస్తే నిజామాబాద్ బస్టాండ్‌లో బిక్షాటన చేసే మహిళ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. బాబును పోలీసులు శిశుగృహకు తరలించారు. అప్పటి నుంచి ఆ చిన్నారి తన అమ్మ నాన్నెవరో తెలియక వారి ఆదరణకు దూరమయ్యాడు. అమ్మ గోరుముద్దలు, నాన్న లాలన అతనికి కరవైంది. కనిపించిన వారినే తనవారిగా భావిస్తున్న అనాథ బాలుడు కార్తీక్‌ను చూస్తే ముచ్చటేస్తున్నా సొంతవారి దరికి ఎప్పుడు చేరతాడో మరి...

Orphan baby
Orphan baby

Orphan baby: బుడి బుడి అడుగులు వేస్తూ అల్లారు ముద్దుగా కనిపిస్తున్న కార్తీక్ అనే బాలుడు... ఆరు నెలల వయసు నుంచే అనాథగా పెరుగుతున్నాడు. నిజామాబాద్ బస్టాండ్‌లో బిక్షాటన చేస్తున్న మహిళ నుంచి గుర్తు తెలియని వ్యక్తి బాబును కొనుగోలు చేశాడు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా వ్యక్తిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తాత్కాలిక వసతి కోసం హైదరాబాద్ శిశువిహార్‌కు పోలీసులు తరలించారు. అప్పటి నుంచి చిన్నారిని సంరక్షించిన హైదరాబాద్ చైల్డ్ వెల్పేర్ కమిటీ సభ్యులు తదుపరి దర్యాప్తు కోసం నిజామాబాద్‌కు పంపించారు. రెండు నెలలుగా నిజామాబాద్ శిశు గృహలో కార్తీక్ వసతి పొందుతున్నాడు. శిశు గృహ సిబ్బంది బాలునికి ఏ లోటూ రాకుండా సపర్యలు చేస్తున్నా... మాతృ ప్రేమను ఇవ్వలేకపోతున్నామని ఉద్వేగంతో చెబుతున్నారు.

ఊహ తెలిసినప్పటి నుంచి..

ఆరు నెలల క్రితం అమ్మ ఒడికి దూరమైన బాలుడు ఊహ తెలిసినప్పటి నుంచి శిశు గృహలోనే గడిపాడు. ఎవరి స్వార్థానికి అనాథగా మిగిలిపోయాడో అర్థం చేసుకునే వయసు కాదు. అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల ఆదరాభిమానాల మధ్య పెరగాల్సిన బాలుడు శిశుగృహలో ఆశ్రయం పొందుతున్నాడు.

కంటికిరెప్పలా కాపాడుతున్న సిబ్బంది...

సరిగా మాటలు రాని బాలుడిని సిబ్బంది కంటికిరెప్పలా కాపాడుతున్నారు. ఆటపాటలతో కార్తీక్‌ను బుజ్జగిస్తూ తల్లిదండ్రులు లేరన్న లోటు తెలియకుండా పెంచుతున్నారు. బాబుకి సంబంధించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే.. నిజామాబాద్ శిశు గృహలో సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. బాలుడి అసలు తల్లిదండ్రులు రాకపోతే దత్తతకు ఇచ్చేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా కార్తీక్‌ కన్నవారి చెంతకు చేరి వారి ఆత్మీయతను పొందాలని కోరుకుందాం.

కార్తీక్ అనే చిన్నారి హైదరాబాద్​ శిశువిహార్​ నుంచి ఆగస్టు నెలలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ బాబు ఇక్కడికి వచ్చినప్పటినుంచి చాలా బాగుంటున్నాడు. అందరితో కలసిమెలసి ఉంటున్నాడు. బాబుకి ఏ లోటూ రాకుండా చూసుకున్నప్పటికీ... మాతృ ప్రేమను ఇవ్వలేకపోతున్నాం. బాబుకి సంబంధించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే.. నిజామాబాద్ శిశు గృహలో సంప్రదించాలని కోరుతున్నాం.-అనిత, శిశు గృహ మేనేజర్

తల్లిదండ్రుల ప్రేమకోసం బాలుడి ఎదురుచూపులు..

ఇదీ చదవండి: mirchi crop price issues : మట్టి మనిషి కంట.. మంట పెడుతున్న మిర్చి పంట..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.