ETV Bharat / state

పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలి: సుదర్శన్​ రెడ్డి

author img

By

Published : Oct 2, 2020, 7:10 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకిస్తూ కిసాన్​ మజ్దూర్​.. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిజామాబాద్​లో నిర్వహించారు. మోదీ ప్రభుత్వం దేశ అభివృద్ధిని, రైతులను పట్టించుకోకుండా అదానీ, అంబానీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి సుదర్శన్​ రెడ్డి విమర్శించారు.

పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలి: సుదర్శన్​ రెడ్డి
పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలి: సుదర్శన్​ రెడ్డి

నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కిసాన్ మజ్దూర్.. సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ధర్నా చౌక్​లో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.

మోదీ ప్రభుత్వం దేశ అభివృద్ధిని, రైతులను పట్టించుకోకుండా అదానీ, అంబానీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సుదర్శన్​ రెడ్డి విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేసేందుకు ఈ వ్యవసాయ బిల్లులను ప్రవేశ పెట్టినట్లు ఆరోపించారు. ఈ బిల్లులపై పార్టీలకు అతీతంగా చేసే ఉద్యమానికి సమయం ఆసన్నమైందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు తాహెర్ బిన్, కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'కర్షకుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకోం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.