మహాశివరాత్రిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బాల్కొండ నియోజకవర్గంలోని పోచంపాడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు చేశారు.
నిజామాబాద్, నిర్మల్ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలే కాక హైదరాబాద్ నుంచి కూడా భక్తులు తెల్లవారుజామునే గోదావరి నది పుణ్యస్నానాలు ఆచరించారు. అభిషేకాలతో మహా శివున్ని పూజించారు.
ఇవీచూడండి: యాదాద్రిలో కన్నుల పండువగా ఆది దంపతుల కల్యాణం