రాష్ట ప్రభుత్వం మహిళా భద్రతపై చేపట్టిన చర్యల్లో భాగంగా నిజామాబాద్ కమిషనరేట్‌లో షీ టీం క్యూఆర్ కోడ్‌ను కమిషనర్ కార్తికేయ శుక్రవారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా క్యూఆర్ కోడ్ ఆధారంగా ఫిర్యాదు చేయవచ్చని సీపీ తెలిపారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తనపై ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వాట్సాప్ నంబర్లకు బదులుగా ఈ కోడ్‌తో చేసే వెసలుబాటు ఉంటుందన్నారు.
ప్రతీ మహిళా తమ మొబైల్ ఫోన్లో దీనిని సేవ్ చేసుకోవాలని కోరారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి... ఈ లింక్ ఓపెన్ చేయాలని సూచించారు. ఇది షీ-టీమ్ సెంట్రల్ సర్వర్‌కు వెళ్తుందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందిస్తారని తెలిపారు. ఉన్నతాధికారులు వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ ఉష విశ్వనాథ్, మహిళా ఎస్సైలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మీకు తెలుసా.. అక్కడ ఆడవాళ్ల పుస్తకాలే ఉంటాయి ఎందుకంటే?