నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్, కో- ఆపరేటివ్ శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య పరిశీలించారు. మంగళవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.
పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో టెంటు, డయాస్, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కామారెడ్డి, నిజామాబాద్ కు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడి నుంచేనని, పాలిటెక్నిక్ కళాశాలలో వచ్చే సోమవారం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్డీఓను ఆదేశించారు.
అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ బూత్ ను, బ్యాలెట్ బాక్స్ లను పరిశీలించారు. ఓటు వినియోగించుకోవడానికి వచ్చినవారికి జడ్పీ సమావేశ మందిరం వెయిటింగ్ హాల్ గా ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు.
ఎన్నికల పరిశీలకుల వెంట అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్టీఓ రవి, ఏసీపీ శ్రీనివాస్, డీసీపీ ఉషా విశ్వనాథ్, జడ్పీ సీఈవో గోవింద్, ఎంపీడీవో సంజయ్, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎల్లంపల్లి జలాశయానికి జలసవ్వడి... రికార్డుల ఒరవడి