నిజామాబాద్ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలను ప్రారంభించామని డీఎంఈ రమేశ్‌రెడ్డి తెలిపారు. కొవిడ్ కారణంగా గత ఏడాదంతా అత్యవసర సేవలకే పరిమితమయ్యామని గుర్తుచేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు.
ఆస్పత్రిలోని.. వైద్య సేవలు, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు డీఎంఈ. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష!