శనగ పంటను కోసి దాదాపు నెల రోజులు కావొస్తున్నా... కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ జిల్లా రైతులు అన్నారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... బోధన్ మండలం సాలురా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకునే సీఎం కేసీఆర్... శనగ రైతులను పట్టించుకోవడం లేదని వాపోయారు.
సొసైటీల ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అనుసరిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదన్నారు. శనగ పంటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ.5,100 ధరను రాష్ట సర్కారు పట్టించుకోవడం లేదని తెలిపారు. రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. బోధన్ గ్రామీణ పోలీసులు చేరుకుని రైతులను అక్కడి నుంచి పంపించి వేశారు.
ఇదీ చదవండి: ఎన్టీపీసీలో నీటిపై తేలాడే పలకలతో విద్యుదుత్పత్తి