ఒక ఎంపీగా మాత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశానని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ నిజామాబాద్‌లో స్పష్టం చేశారు. భాజపా కార్యాలయంలో అమిత్‌షాను కలవలేదని పార్లమెంట్‌లోనే కలిసినట్లు పేర్కొన్నారు. భాజపాలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తన కొడుకు అరవింద్ సిద్ధాంతాలు వేరని వాటితో తనకు సంబంధం లేదనన్నారు. తప్పు చేస్తున్నట్లు తనపై ఆరోపణలు చేసిన తెరాస నేతలు చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి తాను చేయాల్సింది చేస్తానని చెప్పారు. తెరాస పాలనపై స్పందించేందుకు నిరాకరించిన డీఎస్... ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప... ఆ తర్వాత జరిగిందేమి లేదని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం పట్టించుకోక పోవటం చాలా బాధాకరమని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: హుజూర్నగర్ బరిలో 251 మంది సర్పంచ్‌లు..