దేశంలో సాంకేతిక విప్లవ సారధి రాజీవ్ గాంధీ అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
![rajiv-gandhi-birth-anniversary-celebrations-in-nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-04-20-rajiv-jayanthi-av-ts10123_20082020124720_2008f_1597907840_1075.jpg)
ఆయన చేసిన కృషి ఫలితమే ప్రపంచ స్థాయిలో సాంకేతిక పరంగా మనం ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ,అర్బన్ ఇంఛార్జి తాహెర్ బిన్ హందాన్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పా గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు