ETV Bharat / state

వ్యవసాయాన్ని రాజకీయం చేయడం సరికాదు: నిరంజన్​రెడ్డి - త్వరలో రైతు బంధు నిధులు విడుదల

సన్నరకం ధాన్యంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి విమర్శించారు. యాసంగి సీజన్​కు సంబంధించి త్వరలోనే రైతు బంధు నిధులను విడుదల చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

NIRANJAN REDDY
త్వరలోనే రైతుబంధు నిధులను విడుదల చేస్తాం: నిరంజన్​రెడ్డి
author img

By

Published : Nov 17, 2020, 5:00 PM IST

యాసంగి రైతుబంధు నిధులను త్వరలోనే విడుదల చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. నిజామాబాద్​ జిల్లా వేల్పూర్​లో మంత్రి ప్రశాంత్ రెడ్డి.. తన తండ్రి సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన రైతు వేదికను మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతు బంధు అమలుచేస్తున్నామని తెలిపారు. డిమాండ్​కు అనుగుణంగా రైతులు పంటలు వేయాలని సూచించారు. ఏటా మొక్కజొన్న కొనుగోలు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

సన్నరకం ధాన్యంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు బోనస్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతోందని ఆరోపించారు. కేంద్రం.. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. కార్పొరేట్​లకు మేలు చేసే విధంగా వ్యవసాయ చట్టం తెచ్చిందన్నారు.

అంతకుముందు వేముల సురేందర్ రెడ్డి ఘాట్ వద్ద మంత్రులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కేంద్రంలో వ్యాపార ధోరణి మాత్రమే కలిగిన ప్రభుత్వం ఉంది. నేను ఈ మాటను బాధతో చెబుతున్నా.. కేవలం రాజకీయాలను మాత్రమే ప్రాతిపదికగా చూసే ప్రభుత్వమది. కోట్లాది రూపాయల కార్పొరేట్ల అప్పులను కేంద్రం మాఫీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను నిర్వీరం చేసి.. ప్రైవేటుకు కట్టబెడుతున్నారు.

-నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

ఇవీచూడండి: రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.