నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో బుధవారం రాత్రి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం దాటికి గ్రామంలో గుడిసెలు కూలిపోయాయి. మండలంలోని తడగామ, ధర్మారం, మహాంతం, నాడాపూర్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నవీపేట్ మండల కేంద్రంలోని బస్టాండ్, ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం చెరవుని తలపించాయి. ఇళ్లలోకి వచ్చిన నీటిని ప్రజలు బయటకు ఎత్తివేశారు.
ఇవీచూడండి: పీజీ ఈసెట్లో 88.27 శాతం మంది ఉత్తీర్ణత