ETV Bharat / state

'ధనికులకు రెండు పడక గదులు ఎలా ఇస్తారు?' - నిజామాబాద్‌లో రిలే నిరాహార దీక్షలు

పేదలను వదిలేసి ధనికులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా మవందికాలన్‌లో రిలే దీక్షలు చేపట్టారు. అధికార పార్టీ అనుచరులకు ఇచ్చిన ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సర్వే చేసి అసలైన లబ్ధిదారులకు చేరవయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

protest for double bedroom houses in nizamabad district
'ధనికులకు రెండు పడక గదులు ఎలా ఇస్తారు?'
author img

By

Published : Nov 27, 2020, 1:34 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మవందికాలన్‌లో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అధికార పార్టీ అనుచరులకు కేటాయించిన ఇళ్లను పేదలకు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

మవందికాలన్ గ్రామానికి ప్రభుత్వం 20 రెండు పడక గదుల ఇళ్లను కేటాయించగా... సర్పంచ్ వాటిని ధనికులకు కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. అధికారులు సర్వే నిర్వహించి... అసలైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఏశాల గంగాధర్, లక్ష్మణ్, సాయిలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'దిశ' ఘటనకు ఏడాది పూర్తి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.