ఉత్తరప్రదేశ్ హాథ్రస్లో ఓ దళిత యువతి అత్యాచార ఘటనలో నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రధాన వీధులగుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళలు లేనిదే సృష్టికి జీవంలేదని దిశకి ఒక న్యాయం... నిర్భయకు ఒకన్యాయం... హాథ్రస్ బాధితురాలికి ఒకన్యాయం కాకుండా అందరికీ ఒకే న్యాయం చేయాలని కోరారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం...
నిజాన్ని కప్పిపుచ్చుకునేందుకే బాధితురాలి శవాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండా కాల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితురాలైన బాధితురాలికి న్యాయం జరగకుంటే ఈ పోరాటం ఉద్ధృతం చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. మరో రెండు 'నిర్భయ' ఘటనలు