ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందని ప్రైవేటు టీచర్లకు తక్షణమే భృతి అందించాలని ఆర్మూర్ డివిజన్ ప్రైవేటు టీచర్లు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
కొందరు టీచర్లకు రూ.2000, 25 కిలోల బియ్యం అందడం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు పి.డి నాయుడు తెలిపారు. లబ్ధిదారులందరికీ అందేలా చొరవ చూపాలని డీఈవో దుర్గా ప్రసాద్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండి: కొవిడ్ దెబ్బకి గిరాకీలు లేక అల్లాడుతున్న వ్యాపారాలు