ETV Bharat / state

ప్రైవేటు అంబులెన్స్ దగ్ధం... 13 మూగజీవాలు సజీవదహనం

author img

By

Published : Apr 30, 2022, 10:01 PM IST

Updated : May 1, 2022, 12:00 PM IST

Private ambulance
Private ambulance

21:57 April 30

ప్రైవేటు అంబులెన్స్ దగ్ధం... 13 మూగజీవాలు సజీవదహనం

Private ambulance burnt: నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయి మండలం మాక్లూర్ తండా సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ అంబులెన్స్ దగ్ధమైంది. ఈ ఘటనలో అంబులెన్స్​లో అక్రమంగా తరలిస్తోన్న 13 ఎద్దులు మృతి చెందినట్లు పశు వైద్యులు ధృవీకరించారు. ఆదివారం ఉదయం పోలీసులు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల సమక్షంలో పశు వైద్యుడు గంగా ప్రసాద్ పోస్టుమార్టం నిర్వహించారు. ఎక్కువ శాతం కాలడంతో పాటు పొగకు ఊపిరి ఆడక జీవాలు మృతి చెంది ఉంటాయని వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పశువుల వయస్సు 2 నుంచి 8 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు.

ప్రైవేట్​ వాహనాన్ని అంబులెన్స్​గా తీర్చిదిద్ది..: ఈ ఘటనలో ఇద్దరు నిందితులను గుర్తించినట్లు డిచ్​పల్లి సీఐ ప్రతాప్​ పేర్కొన్నారు. ప్రైవేట్​ వాహనాన్ని అంబులెన్స్​ మాదిరిగా తీర్చిదిద్ది.. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. పశువుల కాళ్లను కట్టేసి.. పరిమితికి మించి లోపల కుక్కి.. పక్కా ప్రణాళిక ప్రకారం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి.. నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇకపై జాతీయ రహదారిపై వాహన తనిఖీలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని సీఐ వివరించారు. పోస్టుమార్టం అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు హిందూ సంప్రదాయం ప్రకారం 13 పశువుల కళేబరాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

యాదాద్రి కొండపైకి వాహనాల అనుమతి.. కాకపోతే పార్కింగ్ ఫీజు రూ. 500!

మా ప్రతిపాదనలు ఆమోదించినందుకు ధన్యవాదాలు: సీజేఐ

Last Updated : May 1, 2022, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.