నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగే మేకల సంతలో విషాదం చోటుచేసుకుంది. వేరే ప్రాంతం నుంచి మేకలు విక్రయించేందుకు లారీలో తీసుకొని వచ్చారు. వాటిని లారీల నుంచి దించుతుండగా పైన ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లు తాకి షేక్ దాదే అలీ అక్కడిక్కడే మృతి చెందాడు. శవాన్ని పంచనామాకు తరలించడం ఆలస్యమైనందున మృతుని బంధువులు, గ్రామస్థులు నిజామాబాద్ - బాసర రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: పొట్ట కూటికోసం పోయి... పోలీసుల చెరలో చిక్కారు