ETV Bharat / state

నిజామాబాద్​లో ఎన్​ఎస్​యూఐ నాయకుల ధర్నా

అరెస్టు చేసిన ఎన్ఎస్​యూఐ రాష్ట్ర నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు.

నిజామాబాద్​లో ఎన్​ఎస్​యూఐ నాయకుల ధర్నా
నిజామాబాద్​లో ఎన్​ఎస్​యూఐ నాయకుల ధర్నా
author img

By

Published : Aug 13, 2020, 6:28 PM IST

నిజామాబాద్​ నగరంలోని ఎన్టీఆర్​ చౌరస్తా వద్ద ఎన్​ఎస్​యూఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన రాష్ట్ర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ని రద్దు చేయాలని... పరీక్షలు లేకుండా పైతరగతులకు ప్రమోట్​ చేయాలని డిమాండ్​ చేస్తూ ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించిన రాష్ట్ర నాయకులను అరెస్టు చేశారని ఆరోపించారు.

అరెస్టు చేసిన రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను బేషరతుగా విడుదల చేయాలని ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజు అన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్​ వేసినట్లు వివరించారు. పిల్​ కోర్టులో ఉండగానే పరీక్షల నోటిఫికేషన్​ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్​ఎస్​యూఐ నాయకులు సాయి, రాహుల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సిబ్బంది అపార్థం చేసుకోవద్దు.. లోపాలను సరిదిద్దాలనే.. : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.