తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించిన మహా నాయకుడు కేసీఆర్ అని నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్రావు కొనియాడారు. స్థానిక మక్లూర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ టపాసులను కాల్చి సంబురాలు చేసుకున్నారు.
అనంతరం గ్రీన్ ఫ్రైడేలో భాగంగా పరిషత్ కార్యాలయ ఆవరణలో జడ్పీ ఛైర్మన్ మొక్కలు నాటారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు నూతన చట్టాలని రూపొందిస్తున్నారని విఠల్రావు అన్నారు. యావత్ తెలంగాణ రైతులు.. వీఆర్వో వ్యవస్థ రద్దును స్వాగతిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్