ETV Bharat / state

నిజామాబాద్​ ఘటనలో ఆరుగురి మృతదేహాలు లభ్యం, పోస్ట్​మార్టం​తో మరిన్ని సాక్ష్యాధారాల సేకరణ - నిజామాబాద్ సిక్స్ మర్డర్ కేసు అప్ డేట్

Nizamabad Six Murder Case Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నిజామాబాద్ ఆరు హత్యల విషయంలో విస్తుపోయే నిజాలు బయటికివస్తున్నాయి. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు మృతదేహాలను ఎక్కడ మాయం చేశాడో అన్న విషయాలను వెల్లడించాడు. దీంతో పోలీసులు ఆరు మృతదేహాలను బయటకు తీశారు.

Man Killed 6 Members Of Family For Property
Nizamabad Six Murder Case Update
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 5:59 PM IST

Updated : Dec 21, 2023, 8:13 PM IST

Nizamabad Six Murder Case Update నిజామాబాద్​ ఘటనలో ఆరుగురి మృతదేహాలు లభ్యం పోస్ట్​మార్టం​తో మరిన్ని సాక్ష్యాధారాల సేకరణ

Nizamabad Six Murder Case Update : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌ ఆరు హత్యల ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. హంతకుడు ప్రశాంత్‌ ఆరుగురు కుటుంబీకుల్ని చంపి మృతదేహాలను కనుమరుగు చేసిన విషయం తెలిసిందే. వాటిని ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీశారు.

Serial Killers: ఒంటరి వృద్ధులే లక్ష్యం.. వరుసగా ఆరు హత్యలు!

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌కు చెందిన ప్రశాంత్‌ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ప్రసాద్‌, అతని కుటుంబీకుల్ని హతమార్చిన ఘటన ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పు ఇప్పిస్తానని ప్రసాద్‌ ఇల్లు, పొలాన్ని తన పేరు మీద బదలాయించుకున్న ప్రశాంత్‌, చివరికి ఆస్తి మీద ఆశతో ప్రసాద్‌ కుటుంబం మొత్తాన్ని మట్టు బెట్టాడు. పోలీసులు హంతకుడిని అదుపులోకి తీసుకుని మూడు రోజులుగా విచారణ జరపగా మృతదేహాలను మాయం చేసిన ప్రదేశాలను వెల్లడించాడు. దీంతో పోలీసుల ఆయా ప్రదేశాలకు చేరుకుని పాతిపెట్టిన మృతదేహాలను తవ్వి బయటకు తీశారు.

ఆస్తి కోసం ఆరుగురి వరుస హత్యల కేసు - ప్రధాన నిందితుడు సహా ఐదుగురి అరెస్ట్​

పక్కా ప్రణాళికతో ఒకరి తర్వాత ఒకరిని చంపిన ప్రశాంత్‌, మృతదేహాలను అదే విధంగా మాయం చేశాడు. ప్రస్తుతం ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రశాంత్ చేతిలో హత్యకు గురైన ప్రసాద్‌, అతని భార్య శాన్విక, పిల్లలు, చెల్లెల్ల మృత దేహాలను పోలీసులు వెలికితీశారు. ప్రసాద్‌ మృతదేహం కామారెడ్డి జిల్లా మదనపల్లి సమీపంలోని పాతిపెట్టినట్లు వెల్లడించాడు. అతని భార్య శాన్వికను చంపి నవీపేట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో పడేశాడు.

యువకుడి గొంతు కోసి, తుపాకీతో కాల్చి హత్య- కళ్లు పీకి మరీ!

Man Killed 6 Members Of Family For Property : పెద్ద చెల్లెలు స్వప్నను మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద కాల్చి చంపాడు. పిల్లలిద్దర్నీ బాల్కొండ సమీపంలోని సోన్‌ వద్ద కాల్చి బూడిద చేశాడు. చిన్న చెల్లెలు స్రవంతిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం భూంపల్లి వద్ద హత్యచేసి దహనం చేశాడు. గుర్తు తెలియని మృతదేహంగా ఈ నెల 13న కేసు నమోదు చేసిన సదాశివనగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. కానీ అప్పటికే కుటుంబంలోని ఆరుగురిని హంతకుడు మట్టుబెట్టినట్లు గుర్తించారు.

ఆస్తి కోసం స్నేహితుడి ఘాతుకం - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

హంతకుడు ప్రశాంత్‌ చెప్పిన ఆధారాలతో మాక్లూర్‌ మండలం మదనపల్లిలో పూడ్చిన చోట తవ్వగా ప్రసాద్‌ మృతదేహం లభించింది. నవీపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో అతని భార్య మృతదేహం లభించింది. దీంతో హత్యకు గురైన ఆరుగురి మృతదేహాలను గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామ పూర్తి చేశారు.

హైదరాబాద్‌లో దారుణం - భార్యను హత్య చేసి కనిపించట్లేదని భర్త నాటకం

Last Updated : Dec 21, 2023, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.