నిజామాబాద్ జిల్లాలో వరుస గొలుసు దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. మంగళవారం బోధన్, ఎడపల్లిలో గొలుసు చోరీకి పాల్పడిన నిందితులను రెండు గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో సహకరించిన స్థానికులను పోలీస్ కమిషనర్ కార్తికేయ అభినందించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే దాడికి పాల్పడకుండా పోలీసులకు అప్పగించాలని సూచించారు.
నిందితులు మహారాష్ట్రకు చెందిన ఇరానీ ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నారు. ఇద్దరి నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని... పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో సహకరించిన 19 మంది స్థానికులకు ఉత్తమ పౌరుడు ధ్రువపత్రాలు అందజేశారు.
ఇదీ చూడండి: పూజకు వెళ్లి వచ్చేసరికి... పూర్తిగా దోచేశారు...