నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామంలో హత్యకు గురైన సిద్దార్థ కుటుంబాన్ని ఎంపీ అర్వింద్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.లక్ష చెక్కును అందజేశారు. ఇది కేవలం రాజకీయ హత్యేనని ఎంపీ ఆరోపించారు. భాజపాకు అనుకూలంగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతోనే సిద్ధార్థను హత్య చేశారని అన్నారు.
నిందితులను కాపాడేందుకు తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. జిల్లాలో గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతోందని తెలిపారు. గంజాయి వల్ల యువత పెడదారిన పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.