ETV Bharat / state

ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన - నిజామాబాద్​ జిల్లా వార్తలు

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి మేయర్​ దండు నీతూ కిరణ్​ భూమి పూజ చేశారు. స్వచ్ఛ నిజామాబాద్​ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఐటీఐ కాలేజీ మైదానంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నట్టు ఆమె తెలిపారు.

Nizamabad Mayor Inaugurates Public toilets in town
నిజామాబాద్​లో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన
author img

By

Published : Jul 2, 2020, 10:59 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ప్రజా సౌకర్యార్థం పబ్లిక్​ మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్టు మేయర్​ దండు నీతూ కిరణ్​ తెలిపారు. ఐటీఐ కాలేజీ మైదానంలో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా వ్యాపించే అంటువ్యాధులను నివారించడానికి, పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలో మొత్తం 46 ప్రాంతాల్లో 227 మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు.

నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి పబ్లిక్​ టాయ్​లెట్స్​ నిర్మిస్తామన్నారు. ప్రజలు ఈ మరుగుదొడ్లను ఉపయోగించుకుని బహిరంగ మల, మూత్ర విసర్జనకు స్వస్తి పలకాలని, స్వచ్ఛ నిజామాబాద్​కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జితేష్ వీ పాటిల్, స్థానిక కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.