నిజామాబాద్ నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ మనందరి బాధ్యత అని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. నగరంలోని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఆమె పారిశుద్ధ్య కార్మికులకు పాదరక్షలు పంపిణీ చేశారు. నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని.. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణే.. నగర పరిశుభ్రతకు నాంది అన్నారు. ప్రతి పట్టణవాసి తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని మేయర్ పిలుపునిచ్చారు. ఎవరికి వారు.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే పారిశుద్ధ్య కార్మికులకు సగం భారం తప్పుతుందని ఆమె తెలిపారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ