నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి వాట్సాప్ గ్రూపులో రాజీనామా విషయం వాయిస్ మెసేజ్ రూపంలో పోస్ట్ చేశారు. సూపరింటెండెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు డీఎంఈకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.
వరుస సంఘటనల నేపథ్యంలో మనస్తాపంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో ఒకే రోజు నలుగురు చనిపోవడం, ఆటోలో కోవిడ్‌తో చనిపోయిన మృతదేహం తరలించడం వివాదం అయ్యింది. వీటిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అయితే కోవిడ్ విజృంభించిస్తున్న సమయంలో రాజీనామా చేయడం వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి:నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు రోగులు మృతి