Girls Reaction on Marriage Age : వివాహ వయసు పెంపుపై యువతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 18 నుంచి 21 ఏళ్లకు పెంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనే.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. వివాహ వయసు 21ఏళ్లకు పెంచడం వల్ల ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కలుగుతుందని... తమ కాళ్లపై తాము నిలబడే ధైర్యం వస్తుందని చెబుతున్నారు. కేంద్రం నిర్ణయంపై నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ కళాశాల విద్యార్థులతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
వివాహ వయసు పెంచడంపై చాలా సంతోషంగా ఉందని యువతులు చెబుతున్నారు. చిన్నవయసులో పెళ్లి జరిగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా వేరే ఇంట్లోకి వెళ్లి ఉండడంపై సరైన అవగాహన లేదని పేర్కొన్నారు. కాబట్టి 21 ఏళ్లపైబడిన యువతికి చాలా మెచ్యురిటీ ఉంటుందని యువతులు చెప్పారు. గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుందని యువతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
'చదువుకోవాలని ఆడపిల్లలు ఎన్నో కలలు కంటారు. కానీ కొన్నిచోట్ల ఇంటర్ పూర్తికాగానే పెళ్లి చేస్తారు. ఆ వయసులో మెచ్యురిటీ ఉండదు. అన్ని బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదు. కాబట్టి కనీసం డిగ్రీ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీని లీడ్ చేయగలిగే పరిపక్వత ఉంటుంది. అమ్మాయిల కోసం మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.'
-యువతులు
ఇదీ చదవండి: Marriage Age: అమ్మాయిల కనీస వివాహ వయసు.. 21ఏళ్లకు పెంపు!