కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేస్తోన్న వారికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు, జిల్లా కలెక్టర్ దంపతులు చప్పట్లతో మద్దతు తెలిపారు. తమ ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజలకు నిరంతరం సేవలందిస్తోన్న పోలీసులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ అధికారులకు ప్రజలు చప్పట్లతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
కొవిడ్-19 వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వైరస్ సోకకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రజలు స్వచ్ఛంద బంద్ పాటించడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. వైరస్ కట్టడికి ఐక్యత చాటుతున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చూడండి : కరోనాపై భారత్ సమరం- లాక్డౌన్లో పలు రాష్ట్రాలు