నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎపీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారంలో ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెట్టిన ప్రతి మొక్క బతకాలని లేని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపాలిటీల్లో వార్డుకు ఒక్క నర్సరీ ఉండాలని, అందులో నీటి వసతి ఉండాలన్నారు. గ్రామాల్లో ఇంటికి ఎన్ని మొక్కలు కావాలో ముందుగా గుర్తించాలన్నారు. ప్రతి నర్సరీలో 25000 మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పల్లె వనంలో ఒక్క ఎకరంలో 4000 మొక్కలు, సగం ఎకరం ఉంటే 2000 మొక్కలు నాటాలన్నారు. రోడ్డు పక్కన ప్రతి 5 మీటర్లకు ఒక్క మొక్క పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్