రైతుల పట్ల బ్యాంక్ మేనేజర్ శివ శంకర్ వ్యవహరించే తీరుపై ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే బదిలీ చేస్తామని మేనేజర్‌ను హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండల కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ను డీసీసీబీ ఛైర్మన్ అకస్మికంగా తనిఖీ చేశారు. శివ శంకర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు, ఖాతాదారుల సమస్యలను డీసీసీబీ ఛైర్మన్ అడిగి తెలుసుకున్నారు. బ్యాంకులో ఇచ్చే నగదు సరిపోవడం లేదని రైతులు తెలపడంతో.. ఎన్డీసీసీబీ సీఈఓ గజానంద్‌తో ఫోన్లో మాట్లాడారు. శుక్రవారం నుంచి బీర్కూర్ శాఖకు అవసరం ఉన్న మేరకు నగదు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, సహకార సంఘ అధ్యక్షులు గాంధీ, ఎంపీటీసీ సందీప్, వీరేశం, రాజు, గంగారాం, రైతులు, ఖాతాదారులు, తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: మృతుల కుటుంబాలకు హోంమంత్రి పరామర్శ