ETV Bharat / state

'మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యం' - నిజామాబాద్​ సీపీ కార్తికేయ

నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ, వేల్పూర్‌ పోలీస్‌ స్టేషన్లను సీపీ కార్తికేయ తనిఖీ చేశారు. స్టేషన్​లో దస్త్రాలు పరిశీలించి పలు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

nizamabad commissioner of police karthikeya visited balkonda and velpoor police stations
'మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యం'
author img

By

Published : Feb 13, 2020, 7:51 PM IST

'మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యం'

రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చర్యలు చేపట్టాలని, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని నిజామాబాద్​ పోలీస్​ కమిషనర్​ కార్తికేయ అధికారులకు సూచించారు. నిజామాబాద్​ జిల్లాలోని బాల్కొండ, వేల్పూర్​ పోలీస్​ స్టేషన్లను తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి స్టేషన్​లో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

స్టేషన్​లో దస్త్రాలు తనిఖీ చేసి... పరిష్కరించిన కేసులు, పెండింగ్​లో ఉన్న కేసుల వివరాలపై సీపీ ఆరా తీశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి కేసును డిజిటల్​ రూపంలో నమోదు చేయాలని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.