నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ముల్యాంకన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సందర్శించారు. ఏర్పాట్లను సమీక్షించారు. 350 మంది అధ్యాపకులు, సిబ్బంది పాల్గొననున్న కేంద్రంలో పరిసరాలు పరిశీలించారు. ఫర్నీచర్ అంతా శానిటైజర్‌తో శుభ్రపరిచాలని సూచించారు.
అధ్యాపకులందరికీ ఆరోగ్య పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే మూల్యాంకన కేంద్రంలోనికి అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరికీ మాస్కులు పంపిణీ చేశామన్నారు. మూల్యాంకనంలో పాల్గొనే అధ్యాపకులకు బస్సు సౌకర్యంతో పాటు భోజన సదుపాయాలు కల్పించామన్నారు. ముందుగా స్ట్రాంగ్ రూమ్ సందర్శించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు