నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి పర్యటించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంతో పాటు ట్రాన్స్కో కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని హరితహారం మొక్కలను పరిశీలించారు. వాటి సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాన్స్కో కార్యాలయంలో అపరిశుభ్రత చెత్త, చెదారం ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ ప్రకాష్ రెడ్డికి మెమోలు జారీ చేశారు.
ఇవీచూడండి: బస్తీమే సవాల్: ఆదిలాబాద్ మున్సిపల్ మ్యాచ్లో కప్పు కొట్టేదెవరు...?