నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సిరికొండ మండలంలోని పొత్నూర్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోడ్లపై చెత్తను తొలగించ లేదని, కొత్తగా మొక్కలు నాటలేదని సర్పంచ్, అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలు జరిగినట్లు కనిపించడం లేదని మండిపడ్డారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి గంగాధర్, క్షేత్ర సహాయకుడు నవీన్‌ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
- ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'