నీటి పారుదల శాఖకు చెందిన భూములు, ట్యాంకుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. భూముల వివరాలు సర్వే చేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
30 చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. వాటికి అవసరమైన ఇసుకను ఆర్డీవోలు సరఫరా చేయాలన్నారు. ఈఈలు అశోక్‌కుమార్, భాను ప్రకాష్, భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జోరుగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు