నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ లేదని... వైరస్ వ్యాప్తిపై వదంతులు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఎల్లారెడ్డిపల్లి వాసికి గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని తేలిందని కలెక్టర్ పేర్కొన్నారు.
కరోనాపై అపోహలు, వదంతులు నమ్మవద్దని సూచించారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని... వైరస్ వచ్చినా ఎదుర్కొనే విధంగా అన్ని సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో భాజపా 'సీఏఏ' సభ వాయిదా