ETV Bharat / state

గోదాం నిర్మాణానికి స్థలాలను పరిశీలించిన కలెక్టర్​

గోదాం నిర్మాణానికి నిజామాబాద్​ రూరల్​ మండలంలోని గుండారం గ్రామ శివారులో గల ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్​ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు కలెక్టర్​తో పాటు పాల్గొన్నారు.

nizamabad collector inspected places for godowns
గోదాం నిర్మాణానికి స్థలాలను పరిశీలించిన కలెక్టర్​
author img

By

Published : Jun 10, 2020, 5:50 PM IST

నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో గోదాములు నిర్మించడానికి స్థల సేకరణలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక వ్యవసాయ గోదాం నిర్మాణానికి అనువుగా స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెల్సిందే.

అందులో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామ శివారులోని 9 ఎకరాల 16 గుంటల భూమి, సర్వే నెంబర్ 941లోని ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆర్​డీవో వెంకటయ్య, నిజామాబాద్​ రూరల్ తహసీల్దార్ ప్రశాంత్, నిజామాబాద్ అ​ర్బన్ తహసీల్దార్ హరిబాబు, ఆర్​ఐ ప్రభు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రైతుబంధుపై దుష్ప్రచారం నమ్మొద్దు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.